ఇవాళ(జూన్3) పాలీసెట్, ఎల్​పీ సెట్ ఫలితాలు

ఇవాళ(జూన్3) పాలీసెట్, ఎల్​పీ సెట్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు:పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెలలో నిర్వహించిన పాలిసెట్–2024 ఫలితాలను సోమవారం రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలోనే ఐటీఏ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​లో చేరేందుకు నిర్వహించిన ఎల్​పీ సెట్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు.

మాసబ్ ట్యాంక్​లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. మే 24న జరిగిన పరీక్షకు 82,809 మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు.

ఈ పరీక్షలో క్వాలిఫై అయిన స్టూడెంట్లు మూడేండ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందనున్నారు. కాగా, ఈ నెల 20 నుంచి పాలిసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్  ప్రారంభం కానుండగా, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు.